News

మాధవుడు.. మానవుడు

241views

ప్రకృతి ఎన్నో విశేషాల సమాహారం. తరచి చూసిన కొద్దీ దాని ప్రత్యేకత సాక్షాత్కారమవుతుంటుంది. ఇక్కడి చిత్రాలు ఆ కోవకు చెందినవే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల క్షేత్రం రెండో ఘాట్రోడ్డులోని హరిణికి సమీపంలోని కొండలపై ఉన్న ఓ శిల అచ్చం శ్రీవారిని పోలి ఉన్న వదనంతో అమితంగా ఆకర్షిస్తోంది. చక్రి ఎందెందు వెతికినా అందందే గలడని అనుకుంటూ భక్తులు రెండు చేతులూ ఎత్తి ఈ శిలకు నమస్కరిస్తున్నారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా మంథని నుంచి కాటారం వెళ్లే దారిలో గాడుదులగండి గుట్ట వద్ద ఉన్న కొండ మానవుడి తలని పోలినట్లు ఉంది. నుదురు, ముక్కు, గడ్డం వంటి ఆకారంతో ఆకట్టుకుంటోంది.