News

సత్యదీక్ష వస్త్రాలు, మాలల పంపిణీ

205views

అన్నవరం సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న సత్యదీక్షలకు ప్రచారంతో బాటు సత్యదీక్షలు చేపట్టే స్వాములకు దీక్షా వస్త్రాలు, మాలలు, దీక్షా నియమాల పుస్తకాల పంపిణీ చేశారు. ఏటా కార్తీకమాసం ముందు వచ్చే స్వామివారి జన్మనక్షత్రం ‘ మఖ ’ నాడు దీక్ష ప్రారంభమై 27 రోజుల తరువాత వచ్చే ‘ మఖ ’ నక్షత్రం నాడు దీక్ష విరమించడం ఆనవాయితీగా వస్తోంది.కాగా, ఎక్కువ మంది భక్తులు సత్య దీక్ష చేపట్టేందుకు గాను అన్నవరం చుట్టుప్రక్కల గ్రామాలలో విస్తృత ప్రచారం చేయాలని అధికారులు నిర్ణయించారు. 27 రోజుల దీక్ష కుదరని వారికి, మహిళల కోసం 18 రోజులు, తొమ్మిది రోజుల దీక్ష కూడా చేసే వీలుంది.

దేవస్థానం అధికారులుచైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వీర్ల సుబ్బారావు చేతులమీదుగా దీక్షా వస్త్రాలను పంపిణీ చేశారు. సత్య దీక్షలు చేపట్టనున్న మారేడుమిల్లి, అల్లూరి జిల్లా అడ్డతీగల, తదితర వనవాసీ ప్రాంతాల్లో కూడా ఈ దీక్షా వస్త్రాలు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. సత్యదీక్షలపై సత్యరథంతో ప్రచారం చేయిస్తున్నట్టు తెలిపారు.