News

వింజమూరులో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవం

15views

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామములోని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం-ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో గురువారం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్త గా ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ శ్రీ బయ్యా వాసు గారు అతిథులుగా శ్రీ కోదండరామిరెడ్డి గారు, ఖండ సంఘ చాలక్ శ్రీ దండే మధు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బయ్యా వాసు గారు మాట్లాడుతూ 1925 విజయదశమి రోజున నాగపూర్ లో డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ గారి చేత స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని తెలియజేశారు. దేశములోనే కాక ప్రపంచంలోనే ఆర్ఎస్ఎస్ అతి పెద్ద సామాజిక సేవా సంస్థగా ఉందని ఆర్ఎస్ఎస్ అంటే రెడీ ఫర్ సెల్ఫ్ సర్వీస్ అని తెలిపారు. భారత పాకిస్తాన్ మరియు భారత చైనాల యుద్ద సమయంలో, దివిసీమ ఉప్పెన సమయంలో, వరదలు, భూకంపాల సమయాలలో ఇటీవల సంభవించిన కరోనా విపత్తులో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయం సేవకులు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని తెలియజేశారు. భారతదేశం కర్మభూమి, జ్ఞానభూమి, యోగ భూమి అని భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వ గురువుగా నిలిపే దానికి ఆర్ఎస్ఎస్ గత 100 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తుందని రాబోయే రోజులలో విద్య, ఉపాధి, ఆర్దిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలిపే దానికి సంఘ స్వయంసేవకులందరూ కూడా తమ తమ రంగాలలో నిజాయితీ, నిబద్ధత తో కలిసి పని చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో 150 మంది స్వయంసేవకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.