News

మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ

294views

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు మహిషాసురమర్దని అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. పెద్ద ఎత్తు భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

లోకకంటకుడైన మహిషాసురుడిని చంపిన మహోగ్రరూపం ఇది. సకలదేవీ, దేవతల శక్తులన్నీ ఈ దేవీలో మూర్తీభవించి ఉంటాయి.అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్దినీదేవి అలంకారములో ఉన్న శ్రీఅమ్మవారిని దర్శించడం వలన అరిష్ట్వర్గాలునశిస్తాయి, తత్ఫలితంగా సాత్వికభావం ఉదయిస్తుంది. సర్వదోషాలు పటా పంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి. మానవనేత్రంతో చూడ సాధ్యం కాని దివ్యతేజస్సుతో, అనేక ఆయుధాలతో సింహవాహినియై ఈ తల్లి భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తుంది. ఈ తల్లి అనుగ్రహం పొందితే అసాధ్యమనేది ఉండదు. మహిషాసుర సంహారం జరిగిన రోజునే ‘మహర్నవమి’గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున చండీ సప్తశతీహోమం చేసిన వారికి శత్రుభయం ఉండదు. అన్నింటా విజయం కలుగుతుంది.