News

శ్రీ మహాలక్ష్మీ దేవిగా దుర్గమ్మ

226views

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే!
శంఖచక్రగదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే!!

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్నారు. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి.

జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుతఘట్టము. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన శ్రీ మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి, హాలుడు అనే ‘రాక్షసుడిని సంహరించింది. లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీసమిష్టిరూపమైన అమృతస్వరూపిణిగా శ్రీ దుర్గమ్మ ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించడం వలన భక్తులందరికీ అప్లైశ్వర్యప్రాప్తి, విజయము లభిస్తాయి.