News

కెనడాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం

205views

కెనడాలోని బ్రాంప్టన్ లో 54 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉత్తర అమెరికాలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహంగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందువులకు ఇది అత్యంత గర్వకారణమైన విషయం. ఈ భారీ శివుని విగ్రహాన్ని ఇటీవల బ్రాంప్టన్‌లోని భవానీ శంకర్ ఆలయ సముదాయంలో వేలాది మంది భక్తులు మరియు పర్యాటకుల సమక్షంలో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా భవ్యమైన రథయాత్ర కూడా జరిగింది. ఈ శివుని విగ్రహం కేవలం ఆధ్యాత్మికపరమైనదే కాకుండా సాంస్కృతిక వారసత్వం, బ్రాంప్టన్ గుర్తింపును కూడా మరింత బలోపేతం చేస్తుంది.

ఈ భారీ విగ్రహాన్ని నరేష్ కుమావత్ అనే శిల్పి రూపొందించారు. బ్రాంప్టన్ లో వుండే హిందూ సమాజం సమష్టిగా ఏర్పడి,విరాళాలు సేకరించుకొని, అలాగే అక్కడ వుండే స్వయంసేవకుల విరాళాలతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని పూర్తి చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది.

నరేష్ కుమావత్ అనే శిల్పి ఇప్పటి వరకు 80 కి పైగా దేశాలలో విగ్రహాలను తయారు చేశారు. భారతీయ పురాణాలు, సాంస్కృతిక గుర్తింపుకు సంబంధించిన విగ్రహాలు, స్వాతంత్ర సమర యోధుల విగ్రహాలను కూడా తయారు చేశాడు.

ఇక.. ఈ ఆలయానికి సంబంధించిన ట్రస్టీ తమేష్ సింగ్ మాట్లాడుతూ.. ఇది కేవలం విగ్రహం మాత్రమే కాదని, రాబోయే తరాలకు స్ఫూర్తినిచ్చే సాంస్కృతిక, ఆధ్యాత్మిక మైలు రాయి అని అభివర్ణించారు.అలాగే బ్రాంప్టన్ సిటీ సాంస్కృతిక వారసత్వాన్ని మరింత పెంచుతుందని, ప్రపంచంలోని విభిన్న సంప్రదాయాలు ఎలా వికసిస్తున్నాయో చూపిస్తుందన్నారు.