News

ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణం నిరంతర స్ఫూర్తి

236views

79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావించారు.

” చాలా గర్వంగా ఒక విషయాన్ని నేను చెప్పదలచుకున్నాను.నేటి కాలానికి వందేళ్ల ముందు ఒక సంస్థ పురుడుపోసుకుంది అదే రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్. వంద సంవత్సరాలుగా దేశ సేవలో అంకితమైంది. వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణమనే సంకల్పంతో గత వందేళ్లుగా భరతమాత సంక్షేమమనే లక్ష్యం కోసం లక్షలాది స్వయంసేవకులు మాతృభూమి శ్రేయస్సు కోసం తమ జీవితాలను సమర్పించారు. సేవ, అంకితభావం, సంఘటన మరియు అనుశాసనంకు ప్రతీకగా నిలిచారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్జివోగా ఎదిగింది. నూరేళ్లుగా దేశం కోసం అంకితమైన చరిత్ర దీని సొంతం. ఈ రోజు పురాతన ఎర్రకోట నుండి గత శతాబ్దంగా ఈ దేశ సేవ ప్రయాణంలో సహకరించిన స్వయంసేవకులందరినీ సగర్వంగా గుర్తు చేసుకుంటున్నాను. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఈ వందేళ్ల ప్రయాణం నిరంతరం స్ఫూర్తినిస్తూనేవుంటుంది. అద్భుతమైన అంకితభావం కల్గిన ఈ ప్రయాణం పట్ల దేశం గర్విస్తోంది.