News

హిందువులపై మళ్లీ అవే నీచమైన మాటలు మాట్లాడిన ‘ద్రావిడర్ కళగం’

251views

క్రైస్తవుల సమావేశంలో హిందువులు ‘‘వేశ్యల కుమారులు’’ అంటూ తూలనాడిన ద్రావిడర్ కళగం నేత రమేష్ పై కేసు నమోదైంది. ఈ నెల 4 న కుంభకోణంలో క్రైస్తవ సమావేశం జరిగింది.ఛత్తీస్ గఢ్ లో మిషనరీలపై అక్రమ కేసులు పెడుతున్నారని నిరసిస్తూ ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే డీఎంకే నేత రమేష్ హిందువులను తూలనాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది.

అయితే.. ఇప్పుడు బెయిల్ మంజూరైనా… హిందూ సంఘాలు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నాయి. కానీ కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే ఆర్జేడీ, ఎన్టీకే వంటి వంటి పార్టీలు మాత్రం మద్దతిస్తున్నాయి.

మరో వైపు హిందూ అసోసియేషన్ ఫెడరేషన్ సమన్వయ కర్త వాసుదేవన్ మాత్రం డీఎంకే నేత రమేష్ పై ఫిర్యాదు చేశారు. ”ఛత్తీస్ గఢ్ లో క్రైస్తవ సన్యాసినుల అరెస్టును నిరసిస్తూ ఆగస్టు 4 న ఓ సమావేశం జరిగింది. దీనికి ద్రావిడర్ కళగం నేత రమేష్ హాజరయ్యారు. ఆయన తండ్రి పీటర్. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువులు వేశ్యల కొడుకులు అంటూ తూలనాడారు. హిందువులను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆ సమావేశంలో మహిళలున్నారని కూడా చూసుకోలేదు. వారు అసౌకర్యానికి గురయ్యారు. అయినా ఆపకుండా హిందువులను టార్గెట్ చేస్తూనే వున్నారు. అత్యంత ద్వేషపూరిత ప్రసంగం చేశారు.నాగరిక సమాజంలో అలాంటి ప్రసంగానికి స్థానం లేదని, కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పదే పదే నొక్కి చెప్పింది.భావ ప్రకటనా స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదని, కుల లేదా మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి దీనిని ఉపయోగించరాదు.మేష్ పైనే కాకుండా, అవమానకరమైన వ్యాఖ్యలను ఆపడంలో లేదా ఖండించడంలో విఫలమైన వేదికపై ఉన్న వారందరిపై కూడా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.’’ అని వాసుదేవన్ డిమాండ్ చేశారు.

మరో వైపు తాను మాట్లాడిన దానిని రమేష్ పూర్తిగా సమర్థించుకుంటున్నారు. దీనికి తోడు పెరియార్ ను ఉటంకిస్తున్నారు. అయితే.. ప్రతి సారీ పెరియార్ ను తేవడం ద్రావిడ నేతలకు పరిపాటైపోయింది.

గతంలోనూ ఇవే మాటలు..
2022 లో కూడా వీరమణి విదుతలైకి సంబంధించి ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎంకే నేత రాజా పాల్గొన్నారు. ‘‘నువ్వు శూద్రుడిగా వున్నంత కాలం వేశ్య కొడుకువే. హిందువుగా వున్నంత కాలం దళితుడివే. అంటరానివాడివే. ఎంత మంది వేశ్య కొడుకులుగా వుండాలనుకుంటున్నారు? ఎంత మంది అంటరానివాడిగా వుండాలనుకుంటున్నారు?ఈ ప్రశ్నతో నిలదీస్తే సనాతన ధర్మాన్ని నాశనం చేయవచ్చు.’’ అంటూ నీచంగా మాట్లాడారు.

ఇక.. VCK నేత తోల్ తిరుమావళవన్ కూడా 2022 లో పెరియార్- స్త్రీవాదంపై జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మను ధర్మం’ స్త్రీలను స్వతహాగా వేశ్యలుగా పరిగణిస్తుంది.అప్పుడు ఎలా విలువలతో వుంటారు? అసలు మహిళల గురించి ఏం చెబుతుందో తెలుసా? అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు.

ఇవి కేవలం రెండు ఉదాహరణలే. ఇలా హిందూ ధర్మంపై, హిందువులపై డీఎంకే, వీసీకే నేతలు, క్రైస్తవ పాస్టర్లు మాట్లాడిన సందర్భాలు కోకొల్లలు. అయినా.. వారిపై నమోదైన కేసులు చాలా తక్కువే. వారిని చట్టపరంగా శిక్షించడంలో అక్కడి ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది.