News

గంట గంటకో ప్రవచనం

256views

తమిళనాడు రాజధాని చెన్నై మైలాపూర్‌లోని రాయపేట హై రోడ్‌లో, తిరువళ్లువర్ విగ్రహం మరియు దాని లోపల ఉన్న ట్రాఫిక్ ఐలాండ్ కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ఇక్కడ అదనపు ఆకర్షణ కొత్త క్లాక్ టవర్ నిలిచింది. ప్రతి గంటకూ ప్రవచనాలు చెప్పే టవర్‌ క్లాక్‌ ఇది. ఇందులో విశేషం ఏమిటంటే ప్రవచనాలు వినిపించడం.

తమిళ ప్రాచీన కవి తిరువళ్లువర్‌ రచించిన తిరుక్కురళ్‌ సూక్తులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చెన్నై మహానగర పాలకసంస్థ(జీసీసీ) దీనిని ఏర్పాటు చేసింది. తండయారుపేటలో ఉన్న ఈ టవర్‌ క్లాక్‌ ఏర్పాటుకు రూ.8 లక్షలు ఖర్చు చేశారు. ఈ క్లాక్‌ ప్రతి గంటకోసారి వివిధ భాషల్లో సమయం వెల్లడించి, ఒక తిరుక్కురళ్‌ సూక్తిని వినిపిస్తుంది. వల్లువర్ మాటలను, ప్రజలకు ముఖ్యంగా యువతరాన్ని గుర్తు చేయడమే దీని ఉద్దేశ్యం అధికారులు తెలిపారు.