News

ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌’ నౌకను జాతికి అంకితం చేసిన కేంద్రమంత్రి సంజయ్‌ సేథ్‌

216views

ఆపదలో చిక్కుకునే జలాంతర్గాములను రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ‘ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌’ నౌకను శుక్రవారం విశాఖపట్నంలో కేంద్రమంత్రి సంజయ్‌ సేథ్‌ జాతీకి అంకితం చేశారు.
విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ తీరంలో ఐఎన్ఎస్ నిస్తార్ అనంతరం సంజయ్ సేథ్ మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్ కు ఐఎన్ఎస్ నిస్తార్ ప్రతీకగా నిలుస్తుందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ అన్నారు. స్థానిక పరిశ్రమల భాగస్వామ్యంతో, స్వదేశీ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ నిస్తార్ తయారైందని ఇది మేక్ ఇన్ ఇండియాకు నిదర్శమని తెలిపారు. 2047 వికసిత్ భారత్ కు అనుగుణంగా కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

ప్రత్యేక డైవింగ్‌ టీమ్, బహుళపక్ష వినియోగ డెక్‌లు, హెలికాప్టర్‌ కలిగి ఉండటం ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ ప్రత్యేకతలు. హిందుస్థాన్‌ షిప్‌ యార్డులో నిర్మించిన ఈ నౌక 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. దీని తయారీకి 80 శాతానికిపైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించారు. పూర్తి రిమోట్‌ ఆధారంగా పని చేసే వెసల్‌ అని నేవీ వర్గాల వెల్లడించాయి. తూర్పు నౌకాదళ ముఖ్య కార్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత నేవీ అడ్మిరల్‌ దినేష్‌ కె.త్రిపాఠి తదితరులు హాజరయ్యారు.