News

ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో కణాదుడి ‘పరమాణువు’ సిద్ధాంతం

292views

ప్రాచీన తత్వవేత్త ఆచార్య కణాదుడి ‘పరమాణువు’ సిద్ధాంతం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా చేపట్టిన అంతరిక్ష యాత్రలకు సంబంధించిన అంశాలతో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎన్ సీఈఆర్టీ) పుస్తకాన్ని తయారు చేసింది. ‘క్యూరి యాసిటీ’ పేరుతో 8వ తరగతి కొత్త సైన్స్ పాఠ్య పుస్తకాన్ని తీసుకొచ్చింది. “సంప్రదాయ విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రీయతతో అనుసంధానించడం ద్వారా ఉత్సుకత, పర్యావరణంపై అవగాహన, నైతిక విలువలు, విమర్శనాత్మక ఆలోచనలను పిల్లల్లో అభివృద్ధి చేయవచ్చు” అని పుస్తకం ముందుమాట పేర్కొంది. ఈ పుస్తకంలో పరమాణువు సిద్దాంతం దగ్గరి నుంచి పురాతన కాలంలో ఔషధ మిశ్రమాలను ఎలా తయారు చేశారన్న దానిపై వివిధ అధ్యాయాలు ఉన్నాయి. అదేవిధంగా చంద్రయాన్ 1, 2, 3 మిషన్లు, సూర్యుడి గురించి అధ్యయనానికి సంబంధించిన ఆదిత్య ఎల్1, అంగారకుడి పరి శోధనకు ఉద్దేశించిన మంగళయాన్ గురించి పాఠాలను పుస్తకంలో ఉంచారు.