
ఉత్తరాదిన అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే కార్యక్రమం కన్వర్ యాత్ర, అంటే కావడి యాత్ర. ఈ యాత్ర నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో పెద్ద వివాదమే బయటపడింది. తాము ఎంతో పవిత్రంగా ఆచరించే ఈ యాత్రలో పర మతస్థుల ప్రమేయాన్ని హిందువులు అంగీకరించరు. అలాంటిది తాజమ్ముల్ అనే ముస్లిం గోపాల్ పేరుతో ఒక ధాబాలో కొనసాగడమే వివాదానికి దారి తీసింది. జాతీయ రహదారి 58 వద్ద ఉన్న పండిట్ వైష్ణోదేవి ధాబాలో ఇది జరిగింది. తరువాత వెల్లడైన తీవ్ర ఆగ్రహావేశాల నేపథ్యంలో ఈ ధాబాను మూసివేశారు. తాను యజమాని సూచన మేరకే, హిందూ సంఘాల కన్నుకప్పి గోపాల్ అని పేరుతో చలామణి అయ్యానని తాజుమ్ముల్ జాతీయ మీడియాకు చెప్పాడు.
ఎలా తెలిసిందో ఏమో, హిందూ సంఘాల సభ్యులు కొందరు ధాబాలోకి వచ్చి తాజుమ్ముల్ అనే గోపాల్ను నిలదీశారు. చివరికి అతడు ఏ మతస్థుడో తేల్చుకోవడానికి అతడి పేంటును కూడా విప్పారు. జూన్ 28న జరిగిన ఈ ఘటన పెద్ద వివాదమే రేపింది. స్వామి యశోవీర్ జీ మహరాజ్ నాయకత్వంలో కొన్ని బృందాలు ఇలాంటి వారి ఆచూకీ కోసం ధాబాలలో గాలిస్తూ ఇతడు పనిచేస్తున్న దానిలోకి కూడా వచ్చారు. కన్వార్ యాత్ర జరిగే మార్గాలలో ఉన్న ధాబాల నిర్వాహకుల పేర్లు ప్రదర్శించాలని గతంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దానితోనే ఇప్పుడు ఈ హిందూ బృందాలు హిందువేతరుల వేట మొదలుపెట్టారు. ఈ సంవత్సరం కూడా కన్వార్ యాత్ర నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వాహకుల పేర్లు ప్రదర్శించాలంటూ నిబంధన విధించడంతో ఇది కోర్టుల జోక్యం వరకు వెళుతుందని కొందరు అంటున్నారు. ఇందుకు కారణం, కొన్ని విపక్షాలు, కన్వార్ యాత్ర దారి పొడవునా ధాబాల అధిపతులు, అందులో పనిచేసే వారి పేర్లు వాటి ఎదుట ప్రదర్శించాలని ఆదేశాలు ఉన్నాయి. ముజఫర్ నగర్ ఎమ్మెల్యే కపిల్ దేవ్ అగర్వాల్ కూడా ధాబాలన్నీ ఆయా వివరాలను ముంగిట ప్రదర్శించవలసిందేనని ఆదేశించారు. ఈ అంశం గతంలోనే సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయం మీద స్టే కూడా ఇచ్చింది. ధాబా ఎవరు నిర్వహిస్తున్నారన్న విషయం గురించి మేం అడగడం లేదు. యజమాని, సిబ్బంది పేర్లు మాత్రం తెలియచేయాలని చెబుతున్నాం అంటున్నాయి. అధికార వర్గాలు. అందుకే కన్వార్ యాత్ర జరిగే 540 కిలోమీటర్ల మేర ఉన్న ధాబాల ఎదుట ఆ పేర్లతో ఉన్న బోర్డులు కనిపించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అయినప్పటికి కొందరు మోసం చేస్తున్నారని అర్థమవుతున్నది. దీనితో భక్తులంతా క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు చెల్లించాలని, దీనితో ఎవరైనా వాస్తవాలు మరుగుపరిస్తే బయటపడి పోతుందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్ చౌదురి సూచించారు.
వీహెచ్పీ కార్యకర్తలు కూడా ప్రతి ధాబాను తనిఖీ చేస్తూ లోపల హిందూ దేవీదేవతల బొమ్మలు, డబ్బు ఉంచే పెట్టె దగ్గర వరాహ అవతారం బొమ్మ ఉన్నాయో లేదో కూడా తనిఖీ చేస్తున్నారు. కన్వార్ యాత్రికుల సౌకర్యం కోసం ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా ఉపయోగించవద్దని ధాబా యజమానులకు వారు సూచిస్తున్నారు. ఇవన్నీ కొన్ని ప్రత్యేక ఆరాధనలలో హిందువులకు నిషేధం. కానీ హిందువుల మనోభావాలకు పెద్దగా విలువ ఇవ్వని సెక్యులరిస్టులు, ముస్లిం మతోన్మాద ఎమ్మెల్యేలు గోల ప్రారంభించారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ భారత్లో ఉన్న ఉమ్మడి సంస్కృతిని బీజేపీవారు ధ్వంసం చేస్తున్నారని వాపోయాడు. ఆహార జిహాద్ను అమలులోకి తెస్తున్న కొన్ని వర్గాల నుంచి హిందూమనోభావాలను రక్షించుకోవడానికి ఈ చర్యలు తప్పవని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
చాలామంది ముస్లిం మతోన్మాదులకి సిగ్గూ శరం ఉండవు. బక్రీద్ నాడు గోవధ చేయరాదని అంటే వారికి తీవ్ర ఆగ్రహం వస్తుంది. అది హిందూ ఆధిపత్యం కింద భావిస్తారే తప్ప,వారి మనోభావాలను గౌరవించవలసి ఉంటుందన్న ఇంగిత జ్ఞానం వారు ఎప్పుడూ ప్రదర్శించరు. భక్తి ప్రపత్తులతో మైళ్ల కొద్ది భుజాన కావళ్లతో నడచి గంగకు వెళ్లే ఆ యాత్రికుల మనోభావాలను గౌరవించాలన్న విజ్ఞత ప్రదర్శించడానికి కూడా ఆ ధాబా యజమానులు నిరాకరిస్తున్నరన్నమాట. ఇందులో హిందువులు కూడా ఉన్నారు. వారి ధాబాలను కూడా తనిఖీ చేయవలసి వచ్చింది. కాబట్టి ఇది మనోభావాలను గౌరవించుకునే ప్రక్రియ తప్ప మరొకటి కాదన్నదే అక్కడి హిందూ సంఘాల వాదన.





