
హిందూ అమ్మాయిలను ప్రేమపేరుతో వంచించి వారిని బలవంతంగా మతం మార్చే లవ్ జహాద్ కేసులు కేరళలో పెరుగుతుండడం ఒక ఆందోళనను కలిగిస్తోంది. ముఖ్యంగా హాస్టళ్లలో ఉంటున్న యువతులు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులే వారి టార్గెట్. వారంతా లవ్ జిహాద్ కు బలైపోతున్నారు. ఇటీవలే ఈ లవ్ జిహాద్ కు సంబంధించిన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తాజా కేసు ఒకటి ఎర్నాకుళంలో బయటపడింది.
కేరళలోని సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు నిర్వహించిన దాడిలో, ఆరుగురు యువతులను రక్షించారు, వీరిలో చాలా మందిని ప్రేమ పేరుతో వంచించి, మత్తుమందు ఇచ్చి, ఆపై బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. ఎర్నాకుళం జిల్లాలోని ఎలమక్కర , కడవంత్ర పోలీసులు కలిసి చేపట్టిన ఈ దాడుల్లో అమ్మాయిలను ఇలా వ్యభిచారంలోకి దింపే రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులైన, మన్నార్కడ్‌కు చెందిన అక్బర్ అలీతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
పోలీసుల దర్యాప్తులో చాలా కీలకమైన విషయాలు వెళ్లడయ్యాయి. ఈ రాకెట్ వెనుక ఉన్న కీలక సూత్రధారి అక్బర్ అలీ అందరి అమ్మాయిలతో స్నేహపూర్వకంగా నటిస్తూ, మాల్స్ ,కేఫ్‌లలో యువతులతో, ముఖ్యంగా ప్లస్ టూ విద్యార్థులు , టెక్ వర్కర్లతో స్నేహం చేయడం ద్వారా నెమ్మదిగా వారి నమ్మకాన్ని సంపాదిస్తాడు. ఆ తర్వాత వారిని లవ్ చేస్తున్నట్లు నమ్మబలికి, వారికి డ్రగ్స్ ను పరిచయం చేస్తాడు. వారిని మత్తులో ఉన్నప్పుడే రేప్ చేసి, ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలను తీసుకుని వాటిని అందిరికీ చూపిస్తానని బెదిరిస్తూ వారిని లైంగికంగా వాడుకున్నాడు. అంతేకాక వేరే వారికి వాళ్లని పరిచయం చేసి బలవంతంగా వ్యభిచార ఊబిలోకి దించుతాడు. ఎవరైనా తప్పించుకోవడానికి లేదా ప్రతిఘటనను నివారించడానికి ప్రయత్నిస్తే తన దగ్గర ఉన్న ఫోటోలు, వీడియోలతో అందరినీ బ్లాక్మెయిల్ చేసేవాడు.
ఎర్నాకులం సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలోని అద్దె ఇంట్లో ఈ అనైతిక కేంద్రం నడుస్తోంది. ఒక ప్రైవేట్ సంస్థ ముసుగులో, సమీపంలోని టీ స్టాల్ ముసుగులో ఈ అనైతిక కేంద్రం నడుస్తోంది. ఈ రాకెట్ నిర్వహిస్తున్న అనేక బ్రాంచ్ లలో ఈ ఇల్లు ఒకటి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు , నకిలీ మసాజ్ సెంటర్‌లను ఉపయోగించి మహిళలను అందరికీ పరిచయం చేస్తారు. నిందితుడి ఫోన్ నుండి బాధితుల అనేక ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా వ్యభిచారానికి మోసానికి గురైన వారిలో మైనర్ బాలికలు కూడా ఉన్నారని అనుమానిస్తున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
ఈ అనైతిక కేంద్రాలను ఇతర రాష్ట్రాల నుండి తీసుకువచ్చిన మహిళలను అక్రమ రవాణా చేయడానికి కూడా ఉపయోగించారు. ఎర్నాకుళం జిల్లాలోని ఎడప్పల్లిలో వ్యభిచార ముఠా నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ జరిగింది. అక్బర్ అలీ మొదట అక్కడ పట్టుబడ్డాడు, అయితే ఎర్నాకుళం సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండవ కేంద్రం ఉందని విచారణలో వెల్లడించాడు. ఈ స్థలంలో పోలీసుల దాడుల్లో ఆరుగురు మహిళలు నాటకీయంగా రక్షించబడ్డారు.
ఆశ్చర్యకరంగా, ఒక్క ఎర్నాకుళం పట్టణంలోనే ఇటువంటి 100 కి పైగా అనైతిక కేంద్రాలు పనిచేస్తున్నాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యకలాపాలలో పాల్గొన్న వ్యక్తుల సంఖ్య చాలా ఆందోళనకరంగా ఉంది, నివేదికల ప్రకారం వెయ్యి మందికి పైగా అక్బర్ అలీలు ప్రేమికులుగా , స్నేహితులుగా నటిస్తూ ఒక పథకం ప్రకారమే అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు.
ఈ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని రాబడుతున్నారు. రాను రాను మరికొంతమంది అరెస్టయి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.





