
214views
రాష్ట్రంలో దూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను ఇప్పటికే గుర్తించామని..త్వరలోనే ఆ ఆలయాలన్నింటికి దూపదీప నైవేద్యాలను కల్పిస్తామని దేవదాయ శాఖ ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 161 ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతను పెంచామని, దర్శన విధి విధానాల్లో మార్పు తీసుకువచ్చామన్నారు. దేవాలయ ప్రాంగణాల వద్ద దేవుని నామస్మరణలే ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. సిఎం ఆదేశాలతో దేవాదాయశాఖ నుంచి కామన్ గుడ్ ఫండ్ ద్వారా 200 ఆలయాల పునర్నిర్మాణ పనులను చేపడుతున్నామన్నారు.





