
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్య ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఉదయపూర్ ఫైల్. ఈ చిత్రం ఇప్పటికే అనేక వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి అనేక అభ్యంతరాలు వ్యక్తం అవడంతో ఇఫ్పటికే 150 సన్నివేశాలను తొలగించారు. ఇలా అన్నింటినీ పూర్తి చేసుకుని జులై 11,2025న విడుదలకు సిద్ధం అయింది. అయితే మరో వివాదం తెరపైకి వచ్చింది.
ఈ చిత్రాన్ని నిలిపివేయాలంటూ ముస్లిం సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేక వస్తోంది. ప్రముఖ ఇస్లామిక్ సంస్థ జమాతే ఇ ఇస్లామీ పై డిమాండ్ చేసింది. ఈ సినిమా ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందని వారి వాదన. ఇది కనుక విడుదలైతే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని వారంటున్నారు. అందుకని ఈ సినమాను నిషేధించేలాని మూడు హైకోర్టులలో పిటిషన్ దాఖలు చేయడంతో సినిమా విడుదల పై గందరగోళం నెలకొంది. మరో వైపు సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అబు అజ్వీ కూడా ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని ట్రైలర్ ను కూడా తీసివేయాలని అతను చెప్పాడు. అయితే ఈ సినిమాను నిలిపివేయాలంటూ అత్యవసరంగా సినిమాపై విచారణ జరపాలంటూ వచ్చిన పిటిషన్ ను సుప్రింకోర్ట నిరాకరించడంతో చిత్రయూనిట్ ఊపిరిపీల్చుకుంది.
కన్హయ్యాలాల్ దారుణ హత్య కేసులో నిందుతలలో ఒకరైన మహ్మద్ జావేద్ తరుపు న్యాయవాది “ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ట్రైలర్ ను ఇప్పటికే విడుదల చేశారు. వారు కేవలం ప్రాసిక్యూషన్ వైపునే చూపిస్తున్నారు “అని వాదించారు. అయితే వారి వాదనను సుప్రిం కోర్టు బెంచ్ తోసిపుచ్చింది. “కోర్టు తిరిగి తెరుచుకున్నప్పుడు సంబంధిత కోర్టు ముందు మీ వాదనను తెలియజేయండి. ఆ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేయవద్దు, విడుదల కానివ్వండి “ అంటూ బెంచ్ పేర్కొంటూ అత్యవసర విచారణను నిరాకరించింది. ఇదిలా ఉంటే వీహెచ్పీ ఈ చిత్రానికి మద్ధతను ప్రకటించింది. జమియత్ దీన్న వ్యతిరేకించడాన్ని కపటత్వం అంటూ పేర్కొని సంచలన వ్యాఖ్యలను చేసింది. ఏదిఏమైనప్పటికీ విడుదలకు అనుమతిచ్చిన సుప్రీంకోర్టు నిర్ణయంతో చిత్ర యూనిట్ కు పెద్ద ఊరట అయింది.





