
చేనేత కళాకారుడు, డిజైనర్ లక్కా శ్రీనివాసులు తిరుపతి జిల్లాకు వరంగా మారారని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో చేనేత కళాకారుడు, డిజైనర్ లక్కా శ్రీనివాసులు నేసిన చీరలను స్థానిక ఎమ్మెల్యే తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంత్ కబీర్ అవార్డు తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంకి చెందిన డిజైనర్ లక్కా శ్రీనివాసులు ఎంపిక అవ్వడం చాలా ఆనందదాయకమని, అది జిల్లాకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ అవార్డ్ టెక్స్టైల్, హ్యాండ్లూమ్స్ రంగంలో అత్యున్నత పురస్కారమని, ఈ ప్రాంత వాసులకి ఇప్పటివరకు ముగ్గురికి మాత్రమేరావడం జరిగిందని,దేశ వ్యాప్తంగా ఇద్దరికీ ఇస్తే అందులో మన రాష్ట్రంలోనే తిరుపతి జిల్లా, వెంకటగిరి నియోజకవర్గం నుంచి చేనేత కళాకారుడు, డిజైనర్ లక్కా శ్రీనివాసులు సంత్ కబీర్ అవార్డుకు ఎంపికయ్యారన్నారు.

డిజైనర్ లక్కా శ్రీనివాసులు బూదా సిల్క్ అనగా సిల్క్ వాం చనిపోకుండా వచ్చేట్టు వంటి సిల్క్ ని బూదా సిల్క్ అంటామని ఈ సిల్క్ తో వారు 2 శాతం గోల్డ్ మరియు సిల్వర్ తో వేసిన డిజైన్ కి గాను ఈ సారి అవార్డు రావడం జరిందన్నారు, అదేవిధంగా ఈ సారి తను చేసిన డిజైన్ ని దేశంలో ఎవ్వరు కూడా చేయలేదని, డిజైన్ రెండు వైపులా కనిపించేలా ఉంటుందని, అలాంటి ప్రత్యేకమైన డిజైన్ ని వేసినందుకు గాను అవార్డు వరించిందని అతనికి జిల్లా అధికార యంత్రాంగానికి మరియు హ్యాండ్ లూం శాఖ అధికారుల తరపున నుంచి శుబాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా వారిని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి దుశ్శాలువతో సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించి అభినందించారు.
స్థానిక ఎం.ఎల్. ఏ కె. రామకృష్ణ మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా సంత్ కబీర్ అవార్డు ఇద్దరికీ వస్తే అందులో తిరుపతి జిల్లా, వెంకటగిరి నియోజకవర్గం నుంచి చేనేత కళాకారుడు, డిజైనర్ లక్కా శ్రీనివాసులు కు సంత్ కబీర్ అవార్డుకు ఎంపికయ్యారని ఇది చాల సంతోషించదగ్గ విషయమన్నారు. ఇదివరలో కూడా వారు పలు అవార్డులు అందుకున్న తరుణంలో వారిని నేరుగా సన్మానించడం జరిగిందన్నారు.భవిష్యత్తు లో మరిన్ని అవార్డులు అందుకోవాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు.





