News

మూడు సార్లు జై హింద్ అంటూ దాన్ని సోషల్ మీడియాలో పెట్టాలి…బెయిల్ ఇస్తూ షరతులు విధించిన కోర్టు

288views

ధుబ్రీ జిల్లాలోని గౌరీపూర్‌కు చెందిన స్థానికుడు ఆరిఫ్ రెహమాన్‌కు అస్సాం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. “దేశ వ్యతిరేక” సోషల్ మీడియా కార్యకలాపాలపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలలో భాగంగా ఆయనను మే 2025లో అరెస్టు చేశారు.

రెహమాన్ ఫేస్‌బుక్‌లో అబుబిన్ మిరాజ్ ఉద్దీన్ స్క్ పేరుతో నకిలీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకుని,.”భారత జెట్‌లను కూల్చివేసినందుకు పాకిస్తాన్‌ను ప్రశంసిస్తూ తన నకిలీ ప్రొఫైల్ నుండి “అల్లాహు అక్బర్ పాకిస్తాన్ జిందాబాద్ ఎభాబే భారతేర్ పాస్తా బిమాన్ మేరే దీసే” అనే ట్యాగ్ లైన్‌తో ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశాడు. ఈ నేరంకింద రెహమాన్‌ను మే 9, 2025న అరెస్టు చేసి BNS సెక్షన్లు 113(3), 152, 196, 197(1), 352, మరియు 353 కింద కేసు నమోదు చేశారు. జూన్ 6న బెయిల్ విచారణకు ముందు దాదాపు ఒక నెల పాటు ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నడు.

నిందుతుడు ఫేస్‌బుక్‌లో కొన్ని సున్నితమైన విషయాలను పోస్ట్ చేశాడనడంలో సందేహం లేదు, అతను ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాన్ని కలిగి ఉన్నట్లు పోలీసుల విచారణలలో తేలలేదు ” అని కోర్టు వ్యాఖ్యానించింది. అందుకని అతన్ని 21 రోజుల పాటు ఉదయం 3 సార్లు ‘జై హింద్’ అని అనాలని రెహమాన్‌ను ఆదేశించింది. నిందితుడు అలా అంటూ దాని వీడియోను తయారు చేసి, ఆ వీడియోను తన వ్యక్తిగత ఫేస్‌బుక్ ఖాతాలో/మరేదైనా సామాజిక వేదికలో ప్రతిరోజూ అప్‌లోడ్ చేయాలని కూడా ఆదేశించినట్లు , బహుళ షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసినట్లు సెషన్స్ జడ్జి ఎస్‌బి రెహమాన్ తన బెయిల్ ఉత్తర్వులో పేర్కొన్నారు.
ఈ షరతులలో ట్రయల్ కోర్టు ముందు క్రమం తప్పకుండా హాజరు కావడం, చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలను సమర్పించడం, సాక్షులను ప్రభావితం చేయకపోవడం , “జై హింద్” అని అనడం దాంతో పాటుగా ఆ రికార్డింగ్‌లను ప్రతిరోజూ అప్‌లోడ్ చేయాలనే ఆదేశాన్ని పాటించడం ఉన్నాయి. పాటించడంలో విఫలమైతే బెయిల్ స్వయంచాలకంగా రద్దు చేయబడుతుందని ఆ ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొంది