News

‘సక్షమ్’ ఆధ్వర్యంలో మడకశిరలో దివ్యాంగ సేవా కేంద్రం ప్రారంభం

4views

శ్రీ సత్యసాయి జిల్లా: దివ్యాంగులకు అవసరమైన సేవలు, సహాయ సహకారాలు అందించేందుకు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ‘సక్షమ్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగ సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.

కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ రాష్ట్ర చైర్మన్ గడుపూటి నారాయణస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు రిబ్బన్ కట్ చేసి సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన దివ్యాంగుల సమావేశంలో పాల్గొని, దివ్యాంగుల సంక్షేమం కోసం అందుబాటులో ఉన్న సేవలు, వారికి అవసరమైన సహాయ కార్యక్రమాలపై చర్చించారు.

కార్యక్రమంలో బాలల కమిషన్ డైరెక్టర్ శ్రీనివాసమూర్తి, వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, సక్షమ్ అధ్యక్షుడు వెంకటరమణ, కార్యదర్శి పవన్, హనుమంత్ రెడ్డి, కన్వీనర్ నాగరాజు, టౌన్ కన్వీనర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంచాలకుడు రామాంజనేయులు, ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు ప్రభాకర్, గోపాలకృష్ణ, నాగరత్నమ్మ, నరసన్న, రామచంద్ర, దీపిక, బాలరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.