
ఉత్తరాదిలో శ్రావణ మాసం రాబోతుండడం, పవిత్రమైన కన్వర్ యాత్ర జరగనుండడంతో ఢిల్లీలో కన్వర్ యాత్రకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. జూలై 11 నుండి ప్రారంభమయ్యే ఈ పవిత్ర యాత్ర కోసం ఢిల్లీ ప్రభుత్వం. మున్సిపల్ కార్పొరేషన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాయి. భక్తుల మతపరమైన మనోభావాలను కాపాడడానికి, యాత్ర పవిత్రతను కాపాడడానికి కన్వర్ యాత్ర మార్గంలో అన్నిరకాల మాసాహార దుకాణాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ప్రతి సంవత్సరం శ్రావణ్ లో లక్షలాది మంది కన్వారియాలు గంగా జలాన్ని మోసుకెళ్లి శివుని ఆలయాలకు వెళతారు. ఈసారి దాదాపు 2.5 నుండి 3 కోట్ల మంది కన్వారియాలు ఢిల్లీకి వస్తారని భావిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేస్తుందనీ,.కన్వారియాలు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకూడదని, పూర్తి భక్తితో తమ ప్రయాణాన్ని పూర్తి చేయాలని తాను కోరుకుంటున్నానని పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా చెప్పారు. ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్ లాగా, ఢిల్లీలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నామనీ. అయితే, దుకాణాలు మూసివేయడం వల్ల వారి ఆదాయాలు ప్రభావితమవుతాయని కొంతమంది దుకాణదారులు ఆందోళన చెందుతున్నారు. అయినప్పటికీ, మతపరమైన భావాలు, యాత్రకి ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతోంది.
కన్వారీ యాత్రలో భాగంగా పాల్గొనే కన్వారీలకోసం సౌకర్యార్థం ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేసింది. ఉచిత నీరు, విద్యుత్ . వైద్య సౌకర్యాలు ఏర్పఅందుబాటులో ఉండే వివిధ ప్రదేశాలలో శిబిరాలను ఏర్పాటు చేసింది. కన్వర్ కమిటీలకు రూ. 50 వేల నుండి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం కూడా ఇస్తున్నారు, అందులో సగం ప్రయాణానికి ముందు, మిగిలినది ప్రయాణం తర్వాత ఇవ్వబడుతుంది. ఢిల్లీ సరిహద్దుల్లో అద్భుతమైన స్వాగత ద్వారాలు నిర్మించబడ్డాయి, యాత్ర చేసే కన్వారీలపై పూల వర్షం కురింపిచేలా ఏర్పాట్లు చేశారు. కన్వర్ కమిటీలు సులభంగా సన్నాహాలు చేసుకునేందుకు ముఖ్యమంత్రి రేఖ గుప్తా సింగిల్ విండో వ్యవస్థను ప్రారంభించారు.





