News

ఆలయాల్లో ప్లాస్టిక్‌ నిషేధం.. ఆగస్టు 15 నుంచి సంపూర్ణంగా అమలు

320views

కర్నాటక రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఆగస్టు 15నుంచి ప్లాస్టిక్‌ కవర్ల నిషేధం సంపూర్ణంగా అమలు చేస్తామని దేవదాయశాఖ మంత్రి రామలింగారెడ్డి పేర్కొ న్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఆలయాలకు వచ్చే భక్తులు ఇకపై ఎటువంటి ప్లాస్టిక్‌ వస్తువులను ఉపయోగించరాదన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మూడు నెలల్లో 1,253 ఆలయాలకు సంబంధించి 11,322 ఆస్తులను గుర్తించామన్నారు.

ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక భక్తులకోసం వసతి గృహాలను నిర్మించాలని భావిస్తున్నామన్నారు. తిరుపతి గాంధీరోడ్డులో వసతి గృహాలను నిర్మిస్తున్నామన్నారు. అర్చకుల పిల్లలకు స్కాలర్‌షిప్‌ సౌలభ్యాన్ని అమలు చేస్తున్నామన్నారు. 249మంది విద్యార్థులకు ప్రోత్సాహకవేతనం ఇచ్చామన్నారు. మృతి చెందిన ఏడుగురు అర్చకుల కుటుంబీకులకు రూ.14లక్షలు పరిహారం ఇచ్చామన్నారు.