
ముస్లిం యువతి జరీనా ఇస్లాంను విడిచిపెట్టి సనాతన ధర్మాన్ని స్వీకరించింది. హిందువైన తన ప్రేమికుడిని వివాహం చేసుకోవడానికి రీనాగా మారింది; ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్ఫూర్తితో ఆమె తన ప్రేమికుడైన సాజన్‌ను వివాహం చేసుకోవడానికి రీనాగా మారింది.
కౌశాంబి పరిధిలోని మంఝన్‌పూర్‌కు చెందిన కారు డ్రైవర్ సాజన్. అతని తండ్రి ప్రభుత్వ కార్యాలయంలో క్లాస్ IV ఉద్యోగిగా పనిచేస్తున్నాడు, రెండు సంవత్సరాల క్రితం ప్రతాప్‌గఢ్ పర్యటనలో జరీనాను మొదటిసారి సాజన్ కలిశాడు. అనుకోకుండా జరిగిన వారి పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ కలిసి ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ చాట్‌ల ద్వారా సన్నిహితంగా ఉన్నారు. కాలక్రమేణా వారి సంబంధం ప్రేమగా వికసించింది.
అయితే, వారి మతాంతర సంబంధానికి జరీనా కుటుంబం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఏదేమైనప్పటికీ ప్రతిఘటన, సామాజిక ఒత్తిడిని ఎదుర్కొని, జరీనా తన జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకుంది. ఆమె తన ఇల్లు వదిలి సాజన్‌తో కలిసి ఉండటానికి మంఝన్‌పూర్ చేరుకుంది. ప్రారంభంలో సంకోచించిన సాజన్ కుటుంబం చివరికి ఆమెను స్వాగతించింది. తమ వివాహాన్ని అధికారికంగా చేసుకోవాలని భావించి, అందుకు పూర్తి అంగీకారం కోరుతూ జరీనా తన స్వంత ఇష్టానుసారం సనాతన ధర్మాన్ని స్వీకరించాలని అనుకుంది. ఆమె మంఝన్‌పూర్‌లోని దుర్గా మందిరంలో శుద్ధి కర్మలు చేయించుకుని రీనా అని పేరును మార్చుకుంది. ‘ఘరాతి’ (వధువు కుటుంబం) పాత్ర పోషించిన వీహెచ్‌పీ నాయకుడు వేద ప్రకాష్ సత్యార్థి నేతృత్వంలో వేద మంత్రాల సాక్షిగా హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం జరిగింది.
ఈ నిర్ణయాన్ని తను బలవంతంగా తీసుకోలేదని రీనా బహిరంగంగా వ్యక్తం తెలిపింది. అంతేకాకుండ హిందూత్వ వైఖరికి పేరుగాంచిన యోగి ఆదిత్యనాథ్‌ను తనకు ప్రేరణగా పేర్కొంది. ఆమె పరివర్తన, సాజన్‌తో ఐక్యత కేవలం ఒక ప్రేమకథ మాత్రమే కాదు, ఆమె ప్రవర్తన హిందూధర్మం పట్ల గల విశ్వాసాన్ని సూచిస్తుంది.





