
సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి ప్రక్రియ జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆయన రాజ్యసభలో కశ్మీర్ అంశంపై మాట్లాడుతూ అసోంలో ఎన్‌ఆర్‌సీ జాబితాలో పేర్లు లేనివారు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించవచ్చని, ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. కాగా ఎన్‌ఆర్‌సీ (జాతీయ పౌర జాబిత) దేశవ్యాప్తంగా అమలుచేస్తామని స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్క మతాన్నో లక్ష్యంగా చేసుకుని వారిని తొలగించటానికి కాదని అన్ని మతాలవారికి ఆశ్రయం కల్పిస్తామని, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్సీ శరణార్థులు తదితరులందరూ పౌరసత్వం పొందుతారని అన్నారు.
బెంగాల్‌లో కాదు – మమతా బెనర్జీ

అసోంలో అమలుచేసిన ఎన్ఆర్సీ దేశవ్యాప్తంగా అమలుచేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన వెంటనే టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. “జాతీయ పౌరసత్వ రిజిష్టర్ దేశవ్యాప్తంగా అమలు చేయండి. కానీ అందుకు బెంగాల్ మినహాయింపు” అని స్పష్టంచేశారు. ఎన్ఆర్సీ అమలుచేస్తామని షా చెప్పిన వెంటనే దీదీ ఖండించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





