
కొద్దిరోజుల క్రితం భారత హోంశాఖ కార్యాలయం విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో కాలాపానిని భారత భూభాగంలో చూపడంపై నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కాలాపాని వద్ద మోహరించి ఉన్న భారత సైన్యం వెంటనే అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోవాలంటూ నేపాల్ ప్రధాని కేపీ ఓలీ డిమాండ్ చేశారు.
అయితే మ్యాపులో ఉన్నది ఖచ్చితత్వంతో కూడిన భారత సౌర్వభౌమ భూభాగమని భారత అధికారులు తెలిపారు. గతంలో ఎలా ఉండినదో కొత్త మ్యాపులో కూడా నేపాల్ సరిహద్దు అలానే ఉందని భారత్ స్పష్టం చేసింది.
భారత్ వివరణ:
భారత్ జమ్మూకశ్మీర్ మరియు లడఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత కేంద్ర హోంశాఖ భారత మ్యాపును రీడిజైన్ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగాన్ని జమ్మూకశ్మీర్‌లోకి చేర్చగా గిల్గిట్-బాల్టిస్తాన్‌ను లడాఖ్‌లో చేర్చారు. అయితే కాలాపాని ప్రాంతం నేపాల్ భూభాగంకే చెందుతుందని నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పేర్కొన్నారు. దీనికి సమాధానంగా భారత్ కొత్తగా గీసిన మ్యాప్‌లో నేపాల్ – భారత్ సరిహద్దులను మార్చలేదని స్పష్టం చేసింది. నేపాల్ ప్రభుత్వం అనుమానం లేవనెత్తింది కాబట్టి చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని వెల్లడించింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





