
266views
సంస్కృత విద్యలో ఎంతో మందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన రాష్ట్రపతి అవార్డు గ్రహిత విద్వాన రాజా ఎస్ గిరిరాజాచార్‌కు ఉడిపి పలిమార్ మఠం పీఠాధిపతులు పారా విద్యామాన్య బిరుదును ప్రదానం చేశారు. ఉడిపిలోని మంత్రాలయం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులతో పాటు పలిమార్ మఠం పీఠాధిపతి విద్యాదిశ తీర్థులు, విద్యారాజేశ్వర తీర్థులు అవార్డును ప్రదానం చేశారు. శాలువ, పూలమాల, మెమెంటో, ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు. అవార్డు అందుకున్న గిరిరాజాచార్‌కు శ్రీమఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు వెంకటేశ జోషీ, సురేష్ కోనాపూర్, శ్రీపతాచార్, ఐపీ నరసింహమూర్తిలు అభినందనలు తెలిపారు.





