
వక్ఫ్ (సవరణ) చట్టం-2025కి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారడంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెండు పిటిషన్లు సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలయ్యాయి. ముర్షిదాబాద్, 24 పరగణాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకోవడంతో ప్రాణభయంతో ప్రజలు ఇళ్లు వదిలిపారిపోయారు. ప్రజల జీవితాలు, ఆస్తుల పరిరక్షణకు తీసుకున్న చర్యలేమిటో వెల్లడించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఒక పిటిషనర్ కోరారు. తీవ్ర హింసాత్మక ఘటనలు జరిగిన ముషీరాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్ర భద్రతా బలగాలను మోహరించాలని కలకత్తా హైకోర్టు ఇటీవల ఆదేశించింది.
చట్టాన్ని సవాల్ చేస్తూ మరో పిటిషన్
వక్ఫ్(సవరణ) చట్టం-2025 రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మంగళవారం మరో పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై ఇప్పటికే 12కిపైగా పిటిషన్లు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చాయి. కొత్త పిటిషన్‌ను కూడా విచారణకు స్వీకరిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. తొలుత దాఖలైన పిటిషన్లు బుధవారం నాటి విచారణ జాబితాలో





