News

ఎలమంచిలికి చేరుకున్న అయోధ్య శ్రీరామ రక్షా రథం

234views

అయోధ్య శ్రీరామ రక్షారథం విశాఖపట్నం జిల్లాలోని ఎలమంచిలికి చేరుకుంది. భారీ కంటైనర్‌లో దీన్ని ఎలమంచిలి తీసుకువచ్చారు. విశాఖ డెయిరీ ఛైర్మన్, భాజపా నాయకులు ఆడారి ఆనంద్‌కుమార్‌ ఈ రథాన్ని చేయించారు. ఈనెల 13న మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామంలో రథయాత్ర ప్రారంభం అవుతుంది. మునగపాక మండలంలో నాలుగు రోజులు, అచ్యుతాపురంలో 3, రాంబిల్లిలో 3, ఎలమంచిలిలో 5 రోజులు రథయాత్ర కొనసాగుతుంది. రథం వెంట కోలాటం, చిటికెలు, హరిభజనలు, చెట్టు భజన, సాము గారడి, తప్పెటగుళ్లు తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఆనంద్‌కుమార్‌ చెప్పారు.