News

అమర్‌నాథ్‌ గుహ వరకు రోప్‌వే

426views

అమర్‌నాథ్‌ ఆలయ మార్గం సహా మూడు చోట్ల రోప్‌వేలను నిర్మించడానికి సమగ్ర పథక నివేదిక(డీపీఆర్‌) రూపకల్పనకు బిడ్‌లను ఆహ్వానించినట్లు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం వెల్లడించింది. బాల్‌టాల్‌ నుంచి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ గుహ వరకు 11.60 కి.మీ. మేర ఓ రోప్‌వేతో పాటు బడ్‌గాం, రామ్‌బన్‌ జిల్లాల్లో నిర్మించాల్సిన రెండు రోప్‌వేలు ఈ జాబితాలో ఉన్నాయి. శంకరాచార్య ఆలయం వద్ద రోప్‌ వే నిర్మాణ ప్రక్రియ డీపీఆర్‌ దశలో ఉందని పేర్కొంది.

ఏటా అమర్‌నాథ్ యాత్రకు 3 లక్షలకుపైగా భక్తులు సందర్శించుకుంటూ ఉంటారు. ప్రకృతి అనుకూలించని సమయాల్లో గుహ వద్దకు ఎవరినీ అనుమతించరు. దీంతో ఏడాదితో మూడు నెలలు మాత్రమే యాత్రలో భక్తులు పొల్గొనగలుగుతున్నారు.