News

శ్రీశైలం పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్లను నమ్మవద్దు

371views

శ్రీశైలం దేవస్థానం పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్లను నమ్మి భక్తులు మోసపోకూడదని శ్రీశైలం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అన్నారు. శ్రీశైలంలో దేవస్థానం వసతిని ముందస్తుగా రిజర్వు చేసుకునేందుకు మరియు ఆయా ఆర్జితసేవలను, దర్శనం టికెట్లను ముందస్తుగా పొందేందుకు దేవస్థానం ఆన్లైన్ విధానాన్ని రూపొందించిందనీ తెలిపారు. వసతిని ఆన్లైన్లో రిజర్వు చేసుకునేందుకు మరియు అన్ని ఆర్జితసేవా టికెట్లు, శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం టికెట్లు, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం మొదలైన అన్ని టికెట్లను ఆన్లైన్లో పొందేందుకు భక్తులు దేవస్థానం అధికారిక వెబ్సైట్ www.srisailadevasthanam.org లేదా దేవదాయశాఖ అధికారిక వెబ్సైట్ www.aptemples.ap.gov.in లను మాత్రమే వినియోగించుకోవాళని తెలిపారు. దేవస్థాన మరియు దేవదాయశాఖా వెబ్సైట్ కాకుండా భక్తులు ఇతర నకిలీ వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351 / 52 /53 / లను సంప్రదించవచ్చునీ ఈవో తెలియజేశారు.