
రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్మించిన ఆలయాలకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ తరపున భజన సామగ్రిని అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆమోదం తెలిపింది. తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జేఈవో బసంత్ కుమార్ మరియు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు :
– కార్వేటినగరంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రాహ్మణ బాలల సంప్రదాయ జ్యోతిష్య పాఠశాలకు ఆర్థిక సాయం.
– రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా నూతనంగా నిర్మించిన 500 దేవాలయాల్లో మొదటి విడతగా 100 ఆలయాలకు భజన సామగ్రిని అందించేందుకు నిర్ణయం.
– తిరుపతిలోని శ్వేత భవనంలో నిర్వహిస్తున్న అర్చక శిక్షణకు హాజరవుతున్న ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార అభ్యర్థులకు శిక్షణ కాలంలో రోజుకు 200 రూపాయల చొప్పున భృతి చెల్లించేందుకు ఆమోదం.
– ఏటా జానపద కళాకారుల బృందాల గురువులను సన్మానించాలని నిర్ణయం.
– తిరుమలలో నగర సంకీర్తన, అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారులకు రోజుకి రూ.100ల బదులుగా రూ.200లు చెల్లించేలా నిర్ణయం.
– భజన బృందాల కళాకారులకు రాను, పోను కిలోమీటర్ కు 62 పైసల చొప్పున బస్ చార్జీలు చెల్లించేందుకు నిర్ణయం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





