
323views
దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.
‘‘దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. సమాజ అభివృద్ధికి దోహదపడతాయి. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తోంది. ఆధ్యాత్మికత వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. ప్రతి రాష్ట్ర రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయం ఉండాలి. కోట్లాది మంది భక్తులు దేవాలయాలకు విరాళాలు ఇస్తున్నారు. వాటిని విద్య, వైద్యం సహా ఇతర సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నాం. మన సంస్కృతి, వారసత్వ పరిరక్షణకు దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి’’ అని లేఖలో పేర్కొన్నారు.




