
912views
జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద పాక్ బలగాలు ఆదివారం మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ కుప్వారా జిల్లాలోని తాంఘర్ సెక్టార్‌లో భారత బలగాలపైకి కాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు జవాన్లు అమరులు కాగా.. ఓ సాధారణ పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాల్పుల నెపంతో చొరబాటుదారులను భారత భూభాగంలోకి పంపేందుకు పాక్ బలగాలు ప్రయత్నిస్తున్నాయని సైనిక వర్గాలు తెలిపాయి. ఈ దాడులను మన భద్రతా దళాలు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. పాక్ కాల్పులతో సరిహద్దు గ్రామాల్లోని మరో ఇద్దరు పౌరులు కూడా గాయపడ్డారని సమాచారం. అలాగే రెండు ఇళ్లు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





