
మన తాత్త్వికచింతనకు ఆధారం “ఆత్మవత్ సర్వభూతేషు”. మన సంస్కృతి అన్నిట్లో ఏకత్వాన్ని చవిచూసింది.
నిరంతర విదేశీ దండయాత్రలు, పరాధీనత వలన మన సమాజం సొంత ఆత్మను, మనదైన ప్రకృతిని మరచిపోవడం వంటి అనేక కారణాలవల్ల మన సమాజంలో ఎన్నో కురీతులు ఆచరణలోకి వచ్చాయి. లింగ, ప్రాంత, కుల వివక్షల తోపాటు వికలాంగుల పట్ల వివక్ష కూడా వాటిలో ఒకటి.
సర్వేశ్వరుడు తప్ప సృష్టిలో ఎవ్వరూ సంపూర్ణులు కాదు. ఇటీవలి కాలంలో మన సమాజం, వికలాంగులు వారి కుటుంబానికి, సమాజానికి ఏ విధంగానూ పనికిరారని, ఈ వైకల్యమంతా వారి పూర్వ జన్మ కర్మ ఫలమనే అపోహలో ఉండిపోయింది.
సూర్య భగవానుడి యొక్క విజయవంతమైన రథసారథి, రెండు కాళ్లు లేని అరుణుడు లేదా అనూరుణ్ణి మనం మరచిపోయాం. .

అంధుడై ఉండీ వైదిక మంత్రాల సృష్టికర్త (ఏకం సత్ బహుధా వదన్తి) అయిన దీర్ఘతమ ఋషిని మనం మరచిపోయాం.
మిథిలా రాజ్య చక్రవర్తి జనక మహారాజుకు గురువుగా వ్యవహరించిన, ‘అష్టావక్ర గీత’ గ్రంథ సృష్టికర్త, దివ్యాంగుడైన అష్టావక్రుణ్ణి మనం మరచిపోయాం.
అష్టావక్ర మహర్షి
మధ్యయుగ కాలంలో భక్తి తత్వాన్ని ప్రచారం చేసిన ప్రసిద్ధ కృష్ణ భక్తుడు అయిన సంత్ సూరదాస్ ను మనం మరచిపోయాం.
ఇటీవలి కాలానికి చెందిన అంధులైన విదర్భకు చెందిన గొప్ప యోగి గులాబ్ రావ్ మహరాజ్ ను, ఒడిషాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు భీమ భాయ్ ని, కర్ణాటకకు చెందిన సంగీతకారుడు పుట్టరాజ్ గవాయ్ ని మనం మరచిపోయాం.
ఎప్పటి సంగతో ఎందుకు? దివ్యాంగురాలైన ఇరా సింఘాల్ 2015 ఐఏఎస్ టాపర్ గా నిలిచింది. ఐఏఎస్ మణిరాం శర్మ వినికిడి లోపం ఉన్నవాడు. మరో ఐఏఎస్ కృష్ణగోపాల్ తివారీ దృష్టి లోపం ఉన్నవాడు.

ఇరా సింఘాల్, ఐఏఎస్
ఖేల్ రత్న దీపా మాలిక్ ఓ దివ్యాంగురాలు. మన అంధుల క్రికెట్ జట్టు వరుసగా మూడుసార్లు వరల్డ్ కప్ ను గెలిచింది. పారాలింపిక్స్ & ప్రత్యేక ఒలింపిక్స్ లో పతకాలు నెగ్గడంలో మన భారత జట్టు మొదటి స్థానంలో నిలిచింది.
బొల్లా శ్రీకాంత్, భావేష్ భాటియా ఇద్దరూ అంధులు. జైసింగ్ చవాన్ దివ్యాంగుడు. ఈ ముగ్గురూ కోట్ల టర్నోవర్ కలిగి ఉన్న పారిశ్రామికవేత్తలు.
భావేష్ భాటియా, పారిశ్రామిక వేత్త
మన సమాజం యొక్క దృక్పథమే మనకున్న ఏకైక సమస్య. సమాజంలో చైతన్యం తీసుకురావడం , వికలాంగుల సాధికారత కోసం కృషి చేయడం కోసం సక్షమ : సమదృష్టి క్షమతావికాస్ మరియు అనుసంధాన్ మండల్ 2008 లో నాగపూర్లో ప్రారంభమైంది. వైకల్యాన్ని “ప్రకృతిలోని వైవిధ్యంలో భాగంగా”నే సక్షమ్ చూస్తుంది.
సక్షమ్ అనేది అఖిల భారత సంస్థ. ఇది అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని సుమారు 300 జిల్లాలలో పనిచేస్తోంది. RPD చట్టం 2016 లో పేర్కొనబడ్డ మొత్తం 21 వైకల్యాలకు సంబంధించి పని చేస్తున్న ఏకైక జాతీయ సంస్థ సక్షమ్. దివ్యాంగుల విద్య, ఆరోగ్యం, స్వావలంబన, సామాజికాభివృద్ధి కోసం సక్షమ్ పని చేస్తుంది.
CAMBA (కార్నియా అంధత్వ ముక్త భారత్ అభియాన్), ప్రణవ్, ధీమహీ, ప్రాణద వంటి తమ ప్రాజెక్ట్ ల ద్వారా సమస్యల్ని ముందస్తుగా గుర్తించడం మరియు ముందస్తుగా నివృత్తి చెయ్యడం పై సక్షమ్ దృష్టి కేంద్రీకరించింది.

అలాగే దివ్యాంగులకు ఉపాధి కల్పించడంపై కూడా సక్షమ్ దృష్టి సారించింది.
విశేష ప్రతిభావంతులనే WHO పదానికి పర్యాయంగా, దివ్యాంగులనే పదాన్ని తీసుకొచ్చిన మన ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీకి అభినందనలు.
“అత్మవత్ సర్వభుతేషు” అన్న మన ఆర్యోక్తిని నిజం చేస్తూ సక్షమ్ భారత్ – సమర్థ భారత్ సాకారానికై ఈ మహోద్యమంలో భాగస్వాములు కావలసిందిగా సామాజిక స్పృహ, చైతన్యము, ఉత్సాహము కలిగిన వ్యక్తులందరికీ సక్షమ్ సాదర స్వాగతం పలుకుతోంది.
– డాక్టర్ సుకుమార్, సక్షమ్, అఖిల భారత సంఘటనా కార్యదర్శి, నాగపూర్.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.







