News

భారతదేశ సంస్కృతి అంటే చాలా ఇష్టం

238views

భారతదేశ సంస్కృతి, అలవాట్లు చూడటంతో భారతదేశం పట్ల నాకు చాలా ఇష్టం ఏర్పడిందని రష్యా దేశం రుక్వేనియా ప్రాంతానికి చెందిన రాందాస్‌ పేర్కొన్నారు. వైయస్సార్ జిల్లాలో పులివెందుల పట్టణంలోని అంబకపల్లె రోడ్డులో ఉన్న నగరవనం పార్కును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో సూర్య నమస్కారాలు, ప్రాణాయామం చేసుకున్నారు. రాందాస్‌ వేసుకున్న చొక్కా కూడా జై శ్రీరామ్‌ నామాలతో నిండి ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. పుట్టపర్తి సత్యసాయిబాబా శాంతి నిలయాన్ని సందర్శించి అక్కడి పద్ధతుల గురించి తెలుసుకున్నానని తెలిపారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న గండికోట, అహోబిలం ప్రాంతాలను చూడనున్నట్లు తెలిపారు.