
వక్ఫ్ బోర్డు విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని గ్వాలియర్ ముస్లిం సమాజం ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఎలాగైనా వక్ఫ్ బోర్డు భరతం పట్టాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యంగా శ్మశాన వాటికల భూమిని కూడా వక్ఫ్ లోని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని, దీంతో మృతదేహాలను పూడ్చడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వానికి నివేదించింది. ఈ శ్మశాన వాటికల నిర్వహణ బాధ్యత వక్ఫ్ బోర్డు చూస్తోందని, తన పని నిర్వర్తించడంలో విఫలమైందని మండిపడుతున్నారు. దీనిపై వక్ఫ్ బోర్డుకి, అధికారులకి చాలాసార్లు ఫిర్యాదు చేశామని, అయినా… సరైన చర్యలు లేవని ముస్లిం సమాజం పేర్కొంది. వెంటనే వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. దీని కోసం తమకు సాయం చేయాలని ఎంపీ భరత్ సింగ్ కుష్వాహాకి విజ్ఞప్తి చేశారు.
గ్వాలియర్‌లోని తాటిపూర్ మరియు ఇతర ప్రాంతాలలో స్మశాన భూమిపై ఆక్రమణలు పెరుగుతున్నాయి. కొందరు వ్యక్తులు శ్మశానవాటికలో గుడిసెలు, గుడిసెలు కూడా నిర్మించుకోవడంతో ఇక్కడ మృతదేహాలను పూడ్చేందుకు అసౌకర్యం కలుగుతోంది. ఆక్రమణదారులు రెచ్చిపోవడంతో స్థానికులు కూడా వారిని ఎదిరించడం కష్టంగా మారుతోంది.ఇలాంటి ఆక్రమణలపై వక్ఫ్ బోర్డు చర్యలు తీసుకోవాలని, శ్మశాన వాటికల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముస్లిం సమాజం డిమాండ్ చేస్తోంది.సొసైటీ తన ఫిర్యాదులను గ్వాలియర్ బీజేపీ ఎంపీ భరత్ సింగ్ కుష్వాహా ముందు ఉంచింది. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు.





