NewsProgramms

సంఘమిత్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

355views

నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఇందులో భాగంగా జ్యోతి ప్రజ్వలన, భరత మాతకు, స్వాతంత్ర్య సమరయోధులకు మాలార్పణ, పుష్పార్చన తరువాత ముఖ్య అతిథులు విశ్రాంత సైనిక దంత శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ బచ్చు సంతోస్, శ్రీ సూర్యప్రకాషాచారి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పతాక వందనం తదుపరి ముఖ్య అతిథుల మాట్లాడుతూ విద్యార్థులందరూ చక్కని క్రమశిక్షణతో ఎదిగి భారతమాతను విశ్వగురువుగా నిలపడమే ఆ వీరుల త్యాగాలకు మన మిచ్చే అసలైన నివాళి అని చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు సాఫల్యం చేకూర్చాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగినది.ఈ కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షులు నాగ సుబ్బారెడ్డి, కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్ తో పాటు సంఘమిత్ర కార్యవర్గ సభ్యులు వెంకటయ్య, నాగ రాజయ్య డా ఉదయ్ శంకర్ , రమణయ్య గౌడ్, ఆవాసం ప్రముఖ్ గంగాధర్, ఆవాసం చిన్నారులు పాల్గొన్నారు.

అతి సాధనతో కాని సాధ్యం కాని చిన్నారుల సంక్లిష్టమైన యోగ భంగిమలు, కోలాటం కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఇందుకు కృషిచేసిన కార్యవర్గ సభ్యులైన శ్రీమతి జయశ్రీ, శ్రీమతి వెంకటేశ్శరి గార్లను అతిథులు ప్రశంసించారు.

శాంతి మంత్రంతో కార్యక్రమం సంపన్నమైంది.

కాగా సంఘమిత్ర నిర్వహిస్తున్న 20 అభ్యాసికలలో కూడా గణతంత్రోత్సవం నిర్వహించడం జరిగింది.