News

స్వయంసేవకులను చూసి నేర్చుకుందాం!

358views

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ కు నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉన్నారు. వారు తమ హిందుత్వ సంస్థ సిద్ధాంతం ఎడల మడమ తిప్పని రీతిలో పని చేస్తారు. ఏది ఏమైనా ఆ పంథాను వీడి రారు’. ఇవి ఎవరో విద్యావంతుడు, లేదా మధ్యేమార్గంలో ఉండే మేధావి అన్న మాటలు కాదు. బీజేపీ అన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా మండిపోయే శరద్ పవార్ అన్నారు. ఈ మార్పు దేనికి వచ్చిందో తెలియదు కానీ, వాస్తవాన్ని చెప్పినందుకు అభినందించాలి. దక్షిణ ముంబైలో జవవరి 8వ తేదీన జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. మనం కూడా అలాంటి కార్యకర్తలను తయారు చేసుకుని ఛత్రపతి సాహు మహరాజ్, మహాత్మా ఫూలే, బీఆర్ అంబేడ్కర్, యశ్వంతరావ్ చవాన్ సిద్ధాంతాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. లోకసభ ఎన్నికలలో విజయాన్ని చూసి మనం వాస్తవికతను మరచిపోయామని, కానీ బీజేపీ ఆ అనుభవం నుంచి నేర్చుకుని అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిందని శరద్ పవార్ అన్నారు. నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 90 చోట్ల పోటీ చేసిన ఎన్సీపీ (శరద్ పవార్) 10 స్థానాలు మాత్రమే గెలిచింది.