News

తిరువళ్లువర్ ఫోటో వద్దు!

460views

తమిళుల ఆరాధ్య కవి తిరువళ్లువర్, తిరుక్కురల్ రచయితగా ఆయనకు అక్కడ ఎనలేని గౌరవం ఉంది. తమిళకవిగా, తత్త్వవేత్తగా ఆయనను అక్షరాలా కొలుస్తారు. పెద్దల ఎడల తమ గౌరవాన్ని చాటు కొనడానికి తిరువళ్లువర్ (సాధారణ శకం 4వ శతాబ్దం) విగ్రహానికి పూలదండలు చెన్నై నగరంలో ఆయన పేరుతో మీద పెద్ద కూడలి కూడా ఉంది. సంక్రాంతితో ఆయన జీవితానికి ఉన్న బంధాన్ని బట్టి ఆ రోజున (ఈ జనవరి 15) తమిళ నాడు, పుదుచ్చేరి కూడా తిరువళ్లువర్ దినోత్సవం జరుపుతాయి. 1935లో మే 17 నుంచి 18 వరకు ఆ దినోత్సవం చెన్నై నగరానికి పరిమితమై ఉండేది (ఆయన మైలాపూర్లో పుట్టాడని చెబుతారు. తరువాత మధుర వెళ్లిపోయాడని కూడా చరిత్ర), తరువాత విస్తరించి, జనవరి 15కు మార్చారు. ఆరోజు విద్యా సంస్థలకు సెలవు కూడా ఇస్తారు. ఆయన తమిళ సంస్కృతికి మూలస్తంభం వంటివారు.

కానీ ఆయన ఫోటోను (ఊహాచిత్రం) తొలగించడానికి అనుమతి ఇవ్వవలసిందని ఆ రాష్ట్రంలోని ఒక పాఠశాల జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించింది. ఎందుకు? మెడలో రుద్రాక్షలు, నుదుట విభూతిరేఖలు, మధ్యలో బొట్టు ఉన్నట్టు ఫోటో కనిపిస్తుంది. వాటిని బట్టి ఆయన మత ప్రబోధకుడిలా కనిపిస్తాడు. కాబట్టి తొలగించండి! ఇది ఆ పాఠశాల చూపిన కారణం. కన్యాకుమారి జిల్లా కేంద్రం నాగర్ కోయల్ కలెక్టర్ కార్యాలయంలో జనవరి ఆరున జరిగిన ఫిర్యాదుల సమర్పణ కార్యక్రమంలో ఈ ఫిర్యాదు అందింది. ఈ వినతి సమర్పించిన వారు మండైకాడులోని విడుతలై చిరుతాయిగల్ కట్చి (వీసీకే) పాఠశాల వారు, మహాత్మా గాంధీ, జవాహర్లాల్ నెహ్రూ, నేతాజీ, కె. కామరాజ్, అన్నై థెరిసాల బొమ్మలు, ఫోటోల మధ్య రుద్రాక్షలు, బొట్టుతో ఈ ఫోటో ఉంది కాబట్టి, తొలగించడం అవసరం అని ఆ పాఠశాల కార్యదర్శి ఎస్యీ మెసియా ఆ వినతిపత్రంలో రాశాడు. వాళ్లందరి మధ్య తిరువళ్లువర్ మత నాయకుడిలా కనిస్తున్నాడన్నది మెసియా ఆరోపణ. ఇంతకీ ఇది ప్రభుత్వ పాఠశాలే, తిరువళ్లువర్ మతంతో, కులంతో మమేకమైనాడు కాబట్టి కూడా ఆ ఫోటో ఉంచరాదని ఆ పాఠశాల వారి వాదన. అంతేకాదు, ఒకవేళ ఆయన ఫోటో ఉండాలి అనుకుంటే, ప్రభుత్వం తయారు చేయించిన రూపంతో పెట్టవచ్చునని మెసియా అభిప్రాయపడ్డారు. మనం ఎక్కడికి పోతున్నాం? నిజంగా వేసుకోవలసిన ప్రశ్న కదా! పాలకులు సనాతన ధర్మాన్ని డెంగ్యూతోను, కరోనాతోనూ పోల్చినప్పుడు విద్యావేత్తల రూపంలో ఉన్న హిందూ ధర్మ విధ్వంసకులు ఇలాంటి నీచపు ఆలోచనలు కలిగి ఉండడంలో ఆశ్చర్యం ఏముంది?