News

నోబెల్ కి ఓ గౌరవం వుంది… దానిని కాపాడండి : బంగ్లాదేశ్ ప్రధానికి చురకలు

264views

బంగ్లాదేశ్ లో హిందువులపై ముస్లిం ఛాందసులు చేస్తున్న దాడులు, అఘాయిత్యాలపై నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి హిందువులపై దాడులు చేస్తున్నారని, దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. హిందువులు, మైనారిటీల విషయంలో తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనుస్ వైఖరిని చూస్తుంటే చాలా బాధ కలుగుతోందన్నారు. పాంచజన్య పత్రిక ఇంటర్వ్యూలో కైలాశ్ సత్యార్థి పై విధంగా వ్యాఖ్యానించారు. అయితే హిందువులపై జరుగుతున్న దాడులు, దేవాలయాల విధ్వంసం జరిగిన సమయంలో తాను వ్యక్తిగతంగా మహ్మద్ యూనుస్ కి లేఖ రాశారని వెల్లడించారు. అయినా… దురదృష్టవశాత్తు ఆ లేఖలకు స్పందన కూడా లేదన్నారు.

నోబెల్ బహుమతికి ప్రపంచ వ్యాప్తంగా ఓ గౌరవం వుందని అన్నారు. ఈ విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నానని సత్యార్థి చురకలంటించారు. అంతేకాకుండా నోబెల్ పురస్కార గౌరవాన్ని నెలబెట్టుకోవడానికి ఆయన కృషి చేయాలని హితవు పలికారు. ఇతర శక్తులు ఆయన్ను ఒత్తిడి చేసే అవకాశాలున్నాయని, కానీ.. నోబెల్ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోవాలన్నారు.బంగ్లాదేశ్ ప్రభుత్వం మరియు దాని రాజకీయాలలో అనేక అంతర్జాతీయ శక్తులు ప్రమేయం ఉన్నట్లు కూడా చూడవచ్చు, అవి భారతదేశాన్ని బలహీనపరిచేందుకు కృషి చేస్తున్నాయన్నారు. అయితే హిందువులకు, మైనారిటీలకు మద్దతిచ్చేవారు కూడా బంగ్లాదేశ్ లో వున్నారని, వారిని కూడా కలుపుకు వెళ్లాలని సత్యార్థి సూచించారు.