News

వక్ఫ్ చట్టాన్ని సవరించి తీరుతాం : అమిత్ షా

249views

విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు ఎంతగా అడ్డుకోవాలని చూసినా, వక్స్ చట్ట సవరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణబద్ధులై ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అధికార మహాయుతి కూటమి అభ్యర్థులకు మద్దతుగా మహారా ష్ట్రలోని చంద్రపుర్, యవత్మాల్, హింగోలీ ఎన్నికల సభల్లో ఆయన మాట్లా డారు. 2026 మార్చి 31 నాటికల్లా ఛత్తీస్ గఢ్ నుంచి నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెడతామని ప్రకటించారు.కాశ్మీర్ లో తాము రద్దు చేసిన ఆర్టికల్ 370ను రాహుల్ వంశంలోని నాలుగోతరం వచ్చినా పునరుద్ధరించలేదని స్పష్టం చేశారు.