
316views
ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ఓ చర్చా వేదిక తీవ్ర దుమారానికి తెర తీసింది. ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన చర్చలో జమ్మూకాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తి గురించి కమిటీ సభ్యులు మాట్లాడటంతో భారత విద్యార్థులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కాశ్మీర్ పై మాట్లాడిన ముజ్జా మ్మిల్ ఆయూబ్ ఠాకుర్, జఫార్ఫాన్లకు ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని భారత విద్యార్థులు ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఆయూబ్ తరచూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నా రని దుయ్యబట్టారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. ‘ఆక్స ఫర్డ్ యూనియన్ ఎల్లప్పుడూ ఉగ్రవాదుల వైపే ఉంటుందని’ వారు ఆరోపించారు. జమ్మూకశ్మీర్ అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ భారత్ లోనే ఉంటుందని పేర్కొన్నారు.




