News

కెనడాలోని హిందూ దేవాలయంపై దాడిని ఖండించిన విహెచ్‌పి

302views

కెనడాలోని హిందూ దేవాలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు చేసిన దాడిని విశ్వహిందూ పరిషత్-విహెచ్‌పి ఖండించింది.ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం తెలియజేసినప్పటికీ కెనడా ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేయలేదని, అందుకే ఇలాంటి ఘటన జరిగిందని విహెచ్‌పి పేర్కొంది.

విహెచ్‌పి అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు అలోక్ కుమార్ మాట్లాడుతూ, “కెనడాలోని హిందూ దేవాలయంపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడి చేయడం హర్షనీయం కాదని అన్నారు. భారత రాయబార కార్యాలయం కెనడా ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇచ్చిందని, మూడు రోజుల క్రితం సరైన భద్రత కోసం అభ్యర్థించినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు.

అక్టోబర్ 31, దీపావళి సందర్భంగా, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో “ఇండో- కెనడియన్లకు కెనడాలోని అత్యుత్తమ ప్రాతినిధ్యం లభిస్తుందని”, “హిందూ కెనడియన్లు తమ మతాన్ని స్వేచ్చగా గర్వంగా ఆచరించేలా వారికి భద్రత కల్పించేలా ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటాము” అని ట్రూడో చెప్పారు, అయితే అతని ప్రకటన బూటకమని ఈ ఘటనతో నిరూపితమైందని అలోక్ కుమార్ అన్నారు.

కెనడాలోని ఓ దేవాలయంపై దాడి జరగడం ఇదే తొలిసారి కాదని దీనికి ముందు కూడా, గ్రేటర్ టొరంటో, బ్రిటిష్ కొలంబియా మరియు బ్రాంప్టన్లలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయన్నారు.