
257views
మథురలోని కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదంపై హిందువుల తరఫు పిటిషన్ లన్నింటిని కలిపేస్తూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసు కోవాలంటూ దాఖలైన వినతిని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ముస్లింల తరఫున దాఖలైన ఈ పిటిషన్లను జస్టిస్ మాయాంక్ కుమార్ జైన్ తిరస్కరిం చారు. ఒకే రకమైన రెండు లేదా అంతకంటే ఎక్కువ కేసులుంటే వాటన్నింటినీ ఒక్కటిగా విచారించాలా? లేదా? అన్నది న్యాయస్థానం నిర్ణయిస్తుందని, ఇందులో కక్షిదారుల సమ్మతితో తమకు సంబంధంలేదని స్పష్టం చేశారు.





