
279views
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బిజెపి నేతలను కలిశారు. ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. ధార్మిక సంఘాల నేతలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వాటిని ఎత్తివేసేలా చూడాలన్నారు. తెలంగాణలో అసలు నిఘా వ్యవస్థ పని చేస్తోందా అని ప్రశ్నించారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే సీఎం స్పందించరా? అని నిలదీశారు.





