
277views
కెనడాలో నివసించే భారతీయులపై విద్వేష నేరాలు పెరిగిపోతున్నాయని భారత సంతతికి చెందిన కెనడా పౌరుడు అశ్విన్ అన్నామలై ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ‘ఎక్స్’లో ఆయన ఒక వీడియోను షేర్ చేశారు. అందులో అశ్విన్‌ను భారతీయుడిగా భావించిన ఒక మహిళ జాత్యాహంకార వ్యాఖ్యలు చేసింది. ఈ అనుభవం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని, ఇటువంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.




