News

8 నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రారంభిక్‌ వర్గ

7views

రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌ ప్రారంభిక్‌ వర్గ –2024 ను ఈనెల 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆర్‌ఎస్‌ఎస్‌ కర్నూలు జిల్లా కార్యవాహా కె.చంద్రశేఖర్‌ తెలిపారు. బి. తాండ్రపాడులోని క్రెడో స్కూల్‌లో ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇంటర్‌, ఆపై చదువుతున్న విద్యార్థులు, 16 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు గలవారు ఇందులో పాల్గొన వచ్చని పేర్కొన్నారు. యువత వ్యక్తిగత జీవితానికి అవసరమైన వ్యాయామాలు, యోగా, ఆటలు, కథలు, శారీరక, మానసిక వికాసం, దేశభక్తిని పెంపొందించే అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 92469 21926, 97017 25066 నంబర్లను సంప్రదించాలని సూచించారు.