News

‘పైడితల్లి’ పండగకు ప్రత్యేక రైళ్లు నడపాలి

7views

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి పండగను రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి పండగకు విశాఖ, విజయనగరం, రాయగడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడిపే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే డీఆర్‌ఎంకు లిఖితపూర్వకంగా కోరారు. అక్టోబరు 14 నుంచి 16 వరకూ పండగ నేపథ్యంలో ఉత్తరాంధ్ర నుంచి అత్యధికంగా వచ్చే భక్తులకు ప్రత్యేక రైళ్లు వేయాలని విన్నవించారు. విశాఖపట్టణం, విజయనగరం, పలాస, రాయగడ వరకూ రైళ్లు నడపాలన్నారు.