News

గోమాత ఇకపై ‘‘రాజ్యమాత’’.. ప్రకటించిన మహారాష్ట్ర

7views

గోమాత విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గోమాతను ‘‘రాజ్యమాత’’ గా ప్రభుత్వ ప్రకటించింది. సనాతన హిందూ సంప్రదాయంలో గోమాతకు అత్యంత ప్రాధాన్యత వుందని, అత్యంత పవిత్రంగా చూసే దృష్టికోణం కూడా వుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దేశ ఆధ్యాత్మిక, శాస్త్రీయ, ఇతర చరిత్రలను తీసుకున్నా… గోమాతకు అత్యంత ప్రాధాన్యం వుందని, పురాతన కాలం నుంచీ గోవును పూజిస్తున్నామని పేర్కొంది. మరోవైపు దీనిపై మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సంతకం కూడా చేశారు.
దేశవాళీ ఆవుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతుండటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయంలో ఆవు పేడ ప్రాధాన్యతను కూడా ఆ ప్రకటనలో వివరించింది. ఆవు పాలు మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని, ఆవు మూత్రం కూడా అనేక వ్యాధులను నయం చేస్తుందని, గోమాత ఉత్పత్తులతో మానవులు పౌష్టికాహారాన్ని తీసుకుంటున్నట్టు వివరించారు. మనుషుని జీవితంలో గోవు ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఇది ప్రాచీనం నుంచి వస్తోందని పేర్కొన్నారు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యం వుందని, కామధేనువు అని కూడా పిలుచుకుంటామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ జాతులు ఉన్నప్పటికీ, దేశవాళీ ఆవుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతున్నదని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
మరాఠ్వాడాలోని దేవ్రి మరియు లాల్కనారి మరియు ఉత్తర మహారాష్ట్రలోని డాంగి మరియు షావదాభట్ వంటి అనేక రకాల దేశీయ జాతులకు మహారాష్ట్ర నిలయం. అయితే, ఈ దేశవాళీ ఆవులు వేగంగా క్షీణించడంపై ప్రభుత్వం చాలా సార్లు ఆందోళన వ్యక్తం చేసింది.