News

గుమ్మితం తండాలో పురాతన శాసనం

7views

కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని గుమ్మితం తండా సమీపంలోని మల్లికార్జున స్వామి ఆలయం బయట పురాతన శిలా శాసనం బయటపడింది. ఆలయాల పరిశీలనలో భాగంగా ఇటీవల జిల్లా పురావస్తు శాస్త్రవేత్తలు ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ శిలా శాసనాన్ని గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. దానిపై క్రీస్తు శకం 12, 13వ శతాబ్ద కాలంలో కన్నడం, సంస్కృతం, తెలుగు భాషల్లో అక్షరాలను గుర్తించారు. పూర్వం మల్లికార్జున దేవదేవునికి మహా మండలేశ్వరుని కుమార్తె గంగాదేవి ఏదో బహుమతిని ప్రదానం చేసినట్లు ఈ శాసనం ద్వారా తెలుస్తుందని పురావస్తుశాఖ అధికారుల సమాచారం. ఈ శాసనాన్ని బట్టి ఈ ఆలయానికి విశిష్టమైన చరిత్రఉండనుంది. పురావస్తు శాస్త్రవేత్తలు మరింత నిశితంగా పరిశీలన చేయనున్నట్లు తెలిసింది.