News

ముంబై దాడుల నిందితుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించండి : అమెరికా కోర్టు తీర్పు

35views

ముంబైపై దాడుల కుట్రలో కీలక నిందితుడిగా ఉన్న తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించవచ్చని అమెరికా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2008లో ముంబైపై జరిగిన దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తహవూర్ రాణాను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. అయితే తహవూర్ రాణా అమెరికాలో కోర్టును ఆశ్రయించారు. తనును అప్పగించడం అమెరికా భారత్ నేరగాళ్ల మార్పిడి నిబంధనలకు విరుద్దమని నిందితుడి తరపు అటార్నీ వాదనలు వినిపించారు.

తాజాగా ఈ కేసులో అమెరికాలోని వాషింగ్టన్ కోర్టు తీర్పు వెలువరించింది తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించవచ్చని తీర్పు వెలువరించింది. ముంబైపై జరిగిన దాడి కేసులో తహవూర్ ప్రమేయంపై భారత్ తగిన ఆధారాలు అందించిందని కోర్టు అభిప్రాయపడింది.

2008లో ముంబైలో జరిగిన దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కుట్రకు తహవూర్ ఆర్థికసాయం చేశారని భారత్ ఆరోపిస్తోంది. అంతేకాదు..కుట్రకు ముందు తహవూర్ స్వయంగా రెక్కీ నిర్వహించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రవాదులకు ఆర్థికసాయం చేసిన మరో కేసులో 14 సంవత్సరాలుగా తహవూర్ లాస్‌ఏంజెలెస్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు.