News

ఒకే పోగుతో జాతీయ జెండా

49views

ఒకే పోగుతో 8 అడుగుల వెడల్పు, 10అడుగుల పొడవుతో జాతీయ జెండాను చేనేత కళాకారుడు రుద్రాక్షల సత్యనారాయణ రూపొం దించారు. రాకా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరానికి చెందిన సత్యనారాయణ రూపొందించిన జెండాను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించి అభినందించారు. త్రివర్ణ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య స్ఫూర్తితో దీన్ని తయారు చేసినట్లు సత్యనారాయణ తెలిపారు. ఈ జెం డాను ఐదేళ్ల క్రితమే తయారు చేశానని, అప్పట్లో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్, కేసీఆర్ జెండాను చూసి అభినందించారన్నారు. పార్లమెంటరీ కమిటీ ఈ జెండాని పరిశీలించిందని, ఎర్రకోటపై దీనిని ఎగరువేసే సందర్భం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఒకే దారంలో ఇంత గొప్ప సాహసోపేతమైన జాతీయ జెండాను తయారు చేయటం ఉభయ గోదావరి జిల్లా వాసులకు గర్వకారణమన్నారు. రాకా సంస్థ ప్రధాన కార్యదర్శి జీవీ రమణ, కోశాధికారి సురపురెడ్డి తాతారావు తదితరులు పాల్గొన్నారు